Prakasam: విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Tragedy Two Children Died After Falling Into A Water Hole
x

Prakasam: విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Highlights

Prakasam: ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు

Prakasam: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన.. యర్రగొండపాలెం మండలం పాత గోళ్లవిడిపిలో జరిగింది. మృతులు శివాంజి, సాయిగా గుర్తించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నీటిగుంత దగ్గర ఆడుకునేందుకు చిన్నారులు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories