కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో విషాదం

X
reprasentational image
Highlights
* కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య * ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న తిరమలేశ్ * ఆత్మహత్యకు ముందు పేరెంట్స్, ఫ్రెండ్స్ కోసం సెల్ఫీ వీడియో
Sandeep Eggoju6 Jan 2021 4:45 AM GMT
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో తిరుమలేశ్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు, స్నేహితులకు సెల్ఫీ వీడియో పంపించాడు తిరుమలేశ్. మిమ్మల్ని విడిచి వెళ్తున్నా నన్ను క్షమించండంటూ వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకాడు. కొన ఊపిరితో ఉన్న తిరుమలేశ్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. తమ కుమారుడి నేత్రాలను ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు.
Web Titletragedy in Penugranchiprolu Krishna district
Next Story