కోట్ల వైసీపీలో చేరిక సందర్బంగా అపశృతి..

కోట్ల వైసీపీలో చేరిక సందర్బంగా అపశృతి..
x
Highlights

కోట్ల హర్షవర్థన్‌రెడ్డి వైసీపీలో చేరిక సందర్బంగా ప్రమాదవశాత్తు ఆయన అనుచరులు ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన...

కోట్ల హర్షవర్థన్‌రెడ్డి వైసీపీలో చేరిక సందర్బంగా ప్రమాదవశాత్తు ఆయన అనుచరులు ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన కోట్ల హర్షవర్థన్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు కడప బయలుదేరి వెళుతుండగా... ఓర్వకల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన రాఘవేంద్ర(30), బెస్త రాముడు(32), బెస్త రాము(30) మృతి చెందారు. ఈ సంగతి తెలుసుకున్న వైసీపీ నేతలు మృతులను పరామర్శించారు. ఈ ఘటనతో కర్నూల్ వైసీపీలో దిగ్బ్రాంతి నెలకొంది. కాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల జకాయసూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు హర్షవర్థన్‌రెడ్డి నిన్న(గురువారం) వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories