కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి

కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి
x
Highlights

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో జరుగుతున్న కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం శివరాత్రి పండగ సందర్భంగా జరుగుతున్న తిరునాళ్లలో...

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో జరుగుతున్న కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం శివరాత్రి పండగ సందర్భంగా జరుగుతున్న తిరునాళ్లలో కొండపైకి ప్రభను తీసుకెళ్తుండగా అది కూలిపోయింది. దాంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని నరసారావుపేట ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోవైపు కోటప్పకొండ తిరునాళ్లలో పాల్గొనేందుకు ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి సోమవారం ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories