Badvel Bypoll: రేపే బద్వేల్ బైపోల్

రేపే బద్వేలు బైపోల్(ఫైల్ ఫోటో)
* మొత్తం 281 పోలింగ్ కేంద్రాలు * 148 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు * నియోజకవర్గంలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు
Badvel Bypoll: బద్వేలు ఉపపోరుకు సమయం దగ్గర పడింది. రేపు బద్వేల్ బైపోల్ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 281 పోలింగ్ కేంద్రాల్లో 148 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు.
నియోజకవర్గంలో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గం పరిధిలో 15 ప్లటూన్ల పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. మొత్తం 2 వేల మందితో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేశారు.
బద్వేలు ఉపఎన్నికలో జనసేన, టీడీపీ పోటీ చేయకపోవడంతో వైసీపీ గెలుపు ఏకపక్షమే అనుకున్నారు. అయితే బైపోల్‌ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. దీంతో వైసీపీ వర్సెస్ బీజేపీగా మారింది.
దీంతో బద్వేల్ గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. బీజేపీ గెలిచి వైసీపీ వరుస విజయాలకు చెక్ పెట్టాలని చూస్తుండగా ఈ ఎన్నికలో కూడా గెలిచి తన మార్క్‌ను కొనసాగించాలని వైసీపీ పట్టుదలతో ఉంది.
ఇక బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 16 వేల 139 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు లక్షా 8వేల 777 మంది ఉండగా మహిళలు లక్షా 7వేల 340 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో లక్షా 50వేల 621 ఓట్లు పోలైతే వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్యకు 95 వేల 482 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌కు 50 వేల 748 ఓట్లు పడ్డాయి. దీంతో 44 వేల 734 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు.
అయితే ఈ సారి మాత్రం ఎంత వరకు పోలింగ్ నమోదవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. వెంకట సుబ్బయ్య మృతితో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి డాక్టరు సుధాను వైసీపీ బరిలోకి దింపింది. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లను కూడా తమ ఖాతాలో వేసుకొని, లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయ సాధించాలని వ్యూహ రచన చేస్తోంది వైసీపీ.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Apples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMT