ఏపీలో రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలు

3rd Phase Electionspanchayat elections in Andhra pradesh
x

ఫైల్ ఇమేజ్

Highlights

* ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్ * 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లలో.. * 160 మండలాల్లో జగరనున్న ఎన్నికలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దఫాలు విజయవంతంగా ముగిశాయి. ఇక రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లలో 160 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మరోవైపు ఇప్పటికే 579 పంచాయతీలు, 11 వేల 732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3 వేల 221 పంచాయతీలు, 19 వేల 607 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. రాత్రి వరకు ఫలితాలు వెల్లడిస్తారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories