అక్రమ ఇసుక, మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్‌

అక్రమ ఇసుక, మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్‌
x
Highlights

నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన ఇసుక, మద్యం పాలసీల పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టిసారించింది. ఈ పాలసీని అతిక్రమించి ఇసుక, మద్యం అక్రమ రవాణా...

నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన ఇసుక, మద్యం పాలసీల పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టిసారించింది. ఈ పాలసీని అతిక్రమించి ఇసుక, మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరించాలని నిర్ణయించుకుంది. దాంతో ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నెంబరును ఖరారు చేసింది ప్రభుత్వం. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు.. మద్యం అక్రమ విక్రయాలపై ఫిర్యాదులకు '14500' నెంబర్‌ను కేంద్ర టెలికం శాఖ కేటాయించింది. త్వరలో ఈ నంబర్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని.. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేయనుంది. కాగా ఇప్పటికే ఇసుకను అధిక ధరకు విక్రయిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories