నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
x
Highlights

రాష్ట్రంలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ(శుక్రవారం) ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,...

రాష్ట్రంలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ(శుక్రవారం) ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తామన్నారు.

ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఓటర్ల కోసం పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 94మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories