ఈరోజు రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

Today is the Second Phase of the Panchayat Election Nominations
x

Representational Image

Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 3వేల 335 పంచాయతీల సర్పంచ్‌లకు, 33వేల632 వార్డులకు...

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 3వేల 335 పంచాయతీల సర్పంచ్‌లకు, 33వేల632 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5వ తేదీన పరిశీలన మొదలవుతుంది. 8న మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని అదే రోజు తుది జాబితాను ఖరారు చేస్తారు. 13వ తేదీ పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. సాయంత్రం గానీ, లేక మరుసటిరోజు ఉదయం గానీ ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటారు.

రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఆయా గ్రామాల రిటర్నింగ్‌ అధికారులు ఎక్కడికక్కడ ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేసి.. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపడతారు. 3వేల335 గ్రామ సర్పంచ్‌ పదవులతో పాటు ఆ గ్రామాల పరిధిలో గల 33వేల632 వార్డు పదవులకు కూడా అదే సమయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ఫిబ్రవరి 13న పోలింగ్‌ జరగనుంది.

తొలి విడతలో సర్పంచ్‌ పదవులకు 19వేల 491 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో 3వేల 251 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 3వేల 251 పంచాయతీలకు 19వేల 491 నామినేషన్లు దాఖలు కాగా ఆయా గ్రామాల పరిధిలో 32వేల 522 వార్డు పదవులకు 79వేల799 నామినేషన్లు దాఖలయ్యాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories