Janasena: ఇవాళ జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం

Today is Janasena 10th Foundation Day
x

Janasena: ఇవాళ జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం

Highlights

Janasena: మచిలీపట్నంలో ఆవిర్భావ సభ

Janasena: ఇవాళ మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ జరగనుంది. జాతీయ రహదారి 65కి కిలోమీటర్ దూరంలో ఉన్న 34 ఎకరాల భూమిని కొంతమంది రైతులు జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు అందించారు. వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. ఏపీతో పాటు తెలంగాణ నుంచి భారీ ఎత్తున జన సైనికులు ఆవిర్భావ సభకు తరలి రానున్నారు.

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహిలో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. వారాహి వాహనం రూట్‌ మ్యాప్‌లో మార్పులు జరిగాయి. మంగళగిరి నుంచి ప్రారంభమయ్యే వారాహి యాత్ర విజయవాడ నుంచి ప్రారంభం అవుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కల్యాణ్ ఆటో నగర్‌ వద్ద వారాహి వాహనంలో బయలుదేరుతారు. ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో జన సైనికులు పవన్‌కు ఘన స్వాగతం పలకనున్నారు. జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణాన్ని నాదెండ్ల మనోహర్ సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

జనసేన 10వ ఆవిర్భావ సభలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి పవన్ తన ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో పొత్తుకు సంబంధించిన అంశంపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories