ఏపీలో ఇవాళ రేషన్ పంపిణీ.. మాస్క్ తప్పనిసరి

ఏపీలో ఇవాళ రేషన్ పంపిణీ.. మాస్క్ తప్పనిసరి
x
Highlights

ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది పొందనున్నాయి.

ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది పొందనున్నాయి.రాష్ట్రంలో బియ్యంకార్డు వున్న కుటుంబాలు 1,47,24,017, కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయనున్నారు.

రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు సెట్ చేశారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాలకు రద్దీని బట్టి అదనపు కౌంటర్లను ప్రభుత్వం ఏర్పాటు . రేషన్ కార్డు దారులు, మాస్కులు, గొడుగులు తప్పనిసరిగా వెంట తీసుకు రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఏర్పాటు.. చేతులకు రాసుకుని..సరుకులు తీసుకోవాలి ఉంటుంది.

♦ రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు ఇవ్వనున్నారు.

♦ కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు ఇవ్వనుంది.

♦ పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories