logo

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. తిరుమల తిరుపతి..

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. తిరుమల తిరుపతి..
Highlights

ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...

ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక బిల్లులు, ఆర్డినెన్స్ లపై చర్చిస్తారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రేపటి నుండి అమల్లోకి రానున్న నూతన ఇసుక పాలసీపై చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు, పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వంటి ముఖ్యమైన అంశాలపైనా.. వీటిపై ఇటీవల వచ్చిన కోర్టు తీర్పులపైనా కేబినెట్‌ చర్చించనుంది.

ఇక కీలకమైన 15వ పీఆర్సీ, సీపీఎస్‌ ఉద్యోగుల అంశంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సభ్యుల సంఖ్యను 18 నుండి 25కు పెంచే అంశంపై ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీంతో టీటీడీలో రేపటినుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.


లైవ్ టీవి


Share it
Top