ఏపీ క్యాబినెట్ సమావేశం.. కోడ్ అమల్లోకి రాకముందే కొత్త పథకాలు..

ఏపీ క్యాబినెట్ సమావేశం.. కోడ్ అమల్లోకి రాకముందే కొత్త పథకాలు..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో అన్నదాత సుఖీభ‌వ ప‌థకం విధివిధానాలను సమావేశంలో చర్చించనున్నారు. అలాగే...

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో అన్నదాత సుఖీభ‌వ ప‌థకం విధివిధానాలను సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాజ‌ధానిలో అఖిల భారత స‌ర్వీస్ అధికారుల‌కు ఇళ్ల స్థలాల కేటాయింపు, రాష్ట్రంలో గ్రీన్ కారిడార్‌పై కేబినెట్‌ చర్చించనుంది. గిరిజనులకు 50 ఏళ్లకే వృద్దాప్య పెన్షన్‌ ఇచ్చే అంశంపై, ఢిల్లీలో ధర్మపోరాట దీక్షపై ప్రధానంగా క్యాబినెట్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఖాళీ అవతున్న స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మరో రెండ్రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే షెడ్యూల్‌ విడుదలైన రోజునుంచి ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో కోడ్ అమల్లోకి రాకముందే కొత్త పధకాల ప్రయోజనాలు ప్రజలకు చేరువయ్యేలా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోనుంది.today-ap-cabinate-meeting-in-amaravati

Show Full Article
Print Article
Next Story
More Stories