ఈరోజు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Today Andhra Pradesh Chief Minister Jagan Tour In Visakhapatnam
x
ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

* శారదాపీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొననున్న జగన్‌ * విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధి బృందంతో సమావేశం కానున్న సీఎం

ఏపీ సీఎం జగన్‌ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. ప్రైవేటీకరణ కాకుండా చూడాలని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధి బృందం జగన్‌కు వినతి పత్రం సమర్పించనుంది. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, జేఏసీ నేతలతో జగన్‌ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక పెందుర్తి మండలం చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవం తొలి రోజు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణ చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.


Show Full Article
Print Article
Next Story
More Stories