Coronavirus: కరోనా నియంత్రణ చర్యల్లో తిరుపతి టాప్.. ఎలా సాధ్యమంటే

Coronavirus: కరోనా నియంత్రణ చర్యల్లో తిరుపతి టాప్.. ఎలా సాధ్యమంటే
x
Tirupati
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో స్మార్ట్‌సిటీలైన విశాఖపట్టణం, విజయవాడ, కాకినాడతో పోలిస్తే తిరుపతి అగ్రస్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో స్మార్ట్‌సిటీలైన విశాఖపట్టణం, విజయవాడ, కాకినాడతో పోలిస్తే తిరుపతి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు స్మార్ట్‌మిషన్ ప్రకటించిన ర్యాంకుల్లో తొలి స్థానం సొంతం చేసుకుంది. కోవిడ్ వ్యాప్తి కట్టడి చర్యలు తిరుపతిలో బేషుగా ఉన్నాయని స్మార్ట్‌మిషన్ వెల్లడించింది.

విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్ల వద్ద నిఘా ఉంచడం, వారిని క్వారంటైన్ లో ఉంచడంలో తిరుపతి అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో స్మార్ట్‌సిటీ మిషన్ మూడు గ్రేడ్‌లుగా స్మార్ట్‌నగరాల పనితీరును విభజించి పరిశీలించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో అధికారులు ఇళ్ల వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందిస్తున్నారని స్మార్ట్‌మిషన్ పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories