Tirupati By-Poll: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

Tirupati By-Elections Polling Started
x

Representational Image

Highlights

Tirupati By-Poll: అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 28 మంది అభ్యర్థులు * కరోనా ఉధృతి నేపథ్యంలో సకల జాగ్రత్తలు

Tirupati By-Poll: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17 లక్షల 10 వేల 699. ఇందులో పురుషుల ఓట్లు 8 లక్షల 38 వేల 540... మహిళలు 8 లక్షల 71 వేల 943 మంది ఉన్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోకవర్గాలున్నాయి. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, చిత్తూరు జిల్లాలో మూడున్నాయి.

2వేల 470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 339 సెంటర్లు, గూడూరు 366, సూళ్లూరుపేట 343, వెంకటగిరు 366, తిరుపతి 382, శ్రీకాళహస్తి 362, సత్యవేడు 312 కేంద్రాలు. 877 పోలింగ్ సెంటర్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

కరోనా ఉధృతి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. ఎక్కువమంది ఓటర్లున్న కేంద్రాలను రెండుగా విభజించామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గరా థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజేషన్‌ కోసం ప్రత్యేక సిబ్బంది వుంటారని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకిన వారికి తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ పంపిణీ చేశామన్నారు.

ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మొత్తం 28 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నోటా గుర్తుతో పాటు మొత్తం 29 సింబల్స్‌తో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షించేందుకు 288 మంది సిబ్బందిని నియమించింది ఎన్నికల సంఘం.

Show Full Article
Print Article
Next Story
More Stories