Tirumala: తిరుమల కొండల మధ్య అద్భుత దృశ్యం.. తిరునామాల ఆకృతిలో కనువిందు

Tirumala Water Falls Look Like Thirunamam
x

Tirumala: తిరుమల కొండల మధ్య అద్భుత దృశ్యం.. తిరునామాల ఆకృతిలో కనువిందు 

Highlights

Tirumala: శ్రీ వేంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో కనువిందు చేస్తున్న జలపాతాలు

Tirumala: తిరుమలలో మూడు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో.. వీధులన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్‌‌లు నిండిపోయాయి. జలపాతాలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. అలాగే అలా కొండలపై నుంచి నీళ్లు కిందకు జాలువారుతుంటే అద్భుతంగా ఉంది. అలాగే శేషాచలం అడవి, ఏడుకొండలపై ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఈ అద్భుతాన్ని చూసి భక్తులు మైమరిచిపోతున్నారు.

తిరుమల కొండపై ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. కలియుగ వైకుంఠంమైన ఏడుకొండలలో నుంచి జాలువారిన ఒక జలదార స్వామి వారి మూడు నామాలతో భక్తులకు ప్రత్యక్షoగా కనువిందు చేస్తోంది. సప్త గిరులలో ఈ అద్భుతాన్ని చూసి భక్తులు సరికొత్త అనుభూతినిపొందుతున్నారు. నిజంగా స్వామివారి మహిమే అంటున్నారు కొందరు భక్తులు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

అలా కొండపై నుంచి పరవళ్లు తొక్కుతున్న నీళ్లు చూసేందుకు ఎంత సుందరంగా కనిపిస్తోందో అంటున్నారు భక్తులు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు.. ఈ జలపాతాలను చూసి ఆనందంతో పరవశించిపోతున్నారు. కొండ పైనుంచి జాలువారుతున్న ఆ మూడు జలపాతాలు చూసేందుకు అచ్చం తిరునామంలా ఉందంటున్నారు. ఓ భక్తుడు జలపాతాల వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories