తిరుమల భక్తులకు బిగ్ షాక్: డిసెంబర్–జనవరిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల భక్తులకు బిగ్ షాక్: డిసెంబర్–జనవరిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
x

తిరుమల భక్తులకు బిగ్ షాక్: డిసెంబర్–జనవరిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Highlights

తిరుమలలో డిసెంబర్, కొత్త సంవత్సరం జనవరి నెలలో భారీ భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ కీలకంగా ప్రకటించింది.

తిరుమలలో డిసెంబర్, కొత్త సంవత్సరం జనవరి నెలలో భారీ భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ కీలకంగా ప్రకటించింది. ఈ రెండు నెలల్లో అనేక ప్రత్యేక పర్వదినాలు ఉండటంతో, సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది.

డిసెంబర్–జనవరిలో భక్తుల రద్దీ పీక్స్‌లో

ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ టోకెన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు టోకెన్లు ఇష్యూ చేయగా,

జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు రూ.300 టికెట్లు 15 వేల, శ్రీవాణికి 1000 టోకెన్లు విడుదల చేసింది.

ఈ రోజుల్లో సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని టీటీడీ ప్రణాళిక వేసింది.

వీఐపీ భక్తులకు అనుకోని ట్విస్ట్

పర్వదినాలు, ఉత్సవాలు ఎక్కువగా ఉండటంతో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ముఖ్యంగా:

రద్దు అయ్యే రోజులు

డిసెంబర్ 23 – కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

డిసెంబర్ 29 – వైకుంఠ ఏకాదశి ముందు రోజు

డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు – వైకుంఠ ద్వార దర్శనాలు

జనవరి 25 – రథ సప్తమి (ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే అనుమతి)

అలాగే, పై తేదీలకు ముందురోజు వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

ప్రత్యేక పర్వదినాలు, భారీ రద్దీ నేపథ్యంలో సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపింది. వీఐపీ దర్శనాలు రద్దు చేసినందుకు భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories