తిరుమల కొండపైకి బ్యాటరీ కార్లు..

తిరుమల కొండపైకి బ్యాటరీ కార్లు..
x
Highlights

తిరుమల కొండపై కొత్త కార్లు సందడి చేయనున్నాయి. కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు తెచ్చిన వాహనాలు దూసుకుపోనున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆ...

తిరుమల కొండపై కొత్త కార్లు సందడి చేయనున్నాయి. కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు తెచ్చిన వాహనాలు దూసుకుపోనున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆ కార్లే దర్శనమివ్వనున్నాయి. కొండపై కొత్తగా కనిపించబోయే ఆ కార్లేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే. కలియుగ దైవ సన్నిదైన తిరుమల కొండపైకి బ్యాటరీ కార్లు వచ్చేశాయి. ట్రయల్‌రన్‌లో భాగంగా మూడు కార్లు రయ్‌మంటూ దూసుకుపోయాయి. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొండపైకి బ్యాటరీ కార్లు తీసుకువచ్చారు. ఇది సక్సెస్‌ అయితే ఇకపై బ్యాటర్‌ వాహనాలు నడిపేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.అదే జరిగితే భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్‌ వాహనాలదేనని హవా కొనసాగనుంది.

ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే తిరుమల గిరులు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే హెచ్చరికలతో ఎలక్ట్రిక్‌ వాహనాలను శ్రీకారం చుట్టారు. ప్రమాదకర స్థాయికి కాలుష్యం పెరిగిపోవడంతో దానిని నివారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ,టాటా, మహీంద్ర సంస్థలకు చెందిన మూడు విద్యుత్‌ వాహనాలను తిరుమలపైకి ప్రయోగాత్మకంగా తీసుకొచ్చారు తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీష. ఘాట్‌ రోడ్‌లో బ్యాటరీ వెహికల్స్‌ సామార్థ్యాన్ని పరిశీలించారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లి తిరిగి తిరుమల నుంచి తిరుపతికి బ్యాటరీ కారులో ప్రయాణించి పరీక్షించారు. డీజీల్‌, పెట్రోల్‌ వాహనాలతో సమానంగా బ్యాటరీ కార్లలో సురక్షితంగా ప్రయాణించవచ్చని గీరిష తెలిపారు.

తిరుపతి స్మార్ట్‌ నగరంగా రూపొందిన అనంతరం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా తిరుమలలోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. క్రమక్రమంగా డీజిల్‌, వాహనాన్ని తగ్గించి బ్యాటరీ వాహనాలను పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీష తెలిపారు.ప్రైవేట్‌ టాక్సీలు, బస్సుల వల్ల కాలుష్యం ఎక్కువగా పెరగడంతో ఎలక్ట్రిక్‌ వాహనాలను శ్రీకారం చుట్టారు. ప్రైవేటు ట్రావెల్స్,కాలం చెల్లిన వెహికల్స్‌కు చెక్‌ పెట్టి బ్యాటరీ వాహనాల పై ఆయా డ్రైవర్లకు సబ్సిడితో 10 లక్షల విలువ చేసే బ్యాటరీ కార్లను వాయిదా పద్దతిలో సొంతం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఏదేమైనా కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్న తిరుమల గిరులను కాపాడేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను పలువురు అభినందిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories