తిరుమలేశుని హుండీ ఆదాయం రూ.57లక్షలు.. శ్రీవారిని దర్శించుకున్న 9వేల మందిపైగా భక్తులు

తిరుమలేశుని హుండీ ఆదాయం రూ.57లక్షలు.. శ్రీవారిని దర్శించుకున్న 9వేల మందిపైగా భక్తులు
x
Highlights

ఏపీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి దేవాలయాలు, మాల్స్,...

ఏపీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి దేవాలయాలు, మాల్స్, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేవాలయాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులను దర్శనలకు అనుమతి ఇస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి దర్శనానికి తిరుమల తిరపతి దేవస్థానం పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తోంది.

మార్చి నెలలో దర్శనాలను నిలిపివేసిన టీటీడీ, ఆపై లాక్ డౌన్ సడలింపుల తరువాత నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపై భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని టీటీడీ ప్రకటించింది.

ఈక్రమంలో శ్రీవారిని మంగళవారం 9301 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆరువేల మంది భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. 3750 మందిభక్తులకు టైం స్లాట్‌లో టోకెన్లు జారీ చేశారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.57లక్షలుగా ఉందని టీటీడీ వెల్లడించింది.

శ్రీవాణి ట్రస్ట్ కు 10 వేల రూపాయలు విరాళంగా ఇచ్చే భక్తులకు తిరుమలలో కల్పించే బ్రేక్ దర్శనం టికెట్లను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పేర్కొంది. టీటీడి వెబ్ సైట్, యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని, పరిమిత సంఖ్యలో జేఈఓ కార్యాలయం నుంచి కూడా టికెట్లను జారీ చేస్తామని అధికారులు చెప్పారు. జూన్ నెల కోటాను ప్రస్తుతం ఆన్ లైన్ లో విడుదల చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories