వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం
x
Highlights

వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం వస్తున్న వృద్దులు(65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి కోసం టీటీడీ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసింది. నెలలో రెండు రోజులపాటు వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 15, 29 తేదీల్లో వృద్ధులు , దివ్యాంగులకు 4 వేల టోకెన్లు ఇవ్వనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను ఇస్తున్నారు. దాంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వృద్దులు, దివ్యాంగులను కోరింది టీటీడీ. అలాగే ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులు కూడా అక్టోబర్ 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ విధానం ప్రతినెలా ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories