తిరుమల సర్వదర్శనం టికెట్లు ఆన్ లైన్లో విడుదల.. 5 నిమిషాల్లో ఖాళీ...

తిరుమల సర్వదర్శనం టికెట్లు ఆన్ లైన్లో విడుదల.. 5 నిమిషాల్లో ఖాళీ...
TTD Online Tickets: రేపు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల...
TTD Online Tickets: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్ లైన్లో విడుదల అయ్యాయి. జనవరి నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు పది వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు ఐదు వేల టికెట్లు అందుబాటులోకి తీసుకు వచ్చారు. మిగిలిన రోజుల్లో రోజుకు పది వేల చొప్పున టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచింది.
సర్వదర్శనం ఉచితం కావడంతో చాలా మంది భక్తులు టికెట్లు బుక్ చేసుకునేందుకు తమ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో తితిదే వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఉంచుకున్నారు. సర్వర్‌పై భారం పడుతోన్నందున 9 గంటల సమయంలో 10 నిమిషాలు వర్చువల్ క్యూలో వేచి ఉండాలంటూ స్క్రీన్ పై కనిపించింది. 9.10 ప్రాంతంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు చూడగా ముఖ్యమైన శని, ఆదివారాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే నెల 13 నుంచి 22 తేదీలు బుక్ అయిపోయాయి. ఈ క్రమంలో మిగిలిన తేదీల్లో పేర్లు నమోదు చేస్తుండగానే(అయిదు నిమిషాల్లో) అవి కూడా బుక్ అయిపోయినట్లు వెబ్‌సైట్లో కనిపించిందని పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు రేపు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి కోటాను రేపు మధ్యాహ్నం 3గంటలకు తితిదే విడుదల చేయనుంది. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500).. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ.300) ఇందులో ఉండనున్నాయి. జనవరి 14నుంచి 22వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు(రూ.500)రేపు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్ దర్శన టికెట్లూ విడుదల కానున్నాయి. సోమ నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500).. శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల(రూ.500)ను రేపు తితిదే విడుదల చేయనుంది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT