భక్తులతో కళకళలాడుతున్న తిరుమల క్షేత్రం

Tirumala Kshetra Bustling With Devotees
x

భక్తులతో కళకళలాడుతున్న తిరుమల క్షేత్రం

Highlights

Tirumala: ప్రస్తుతం 4 కోట్లకు పైగా లభించిన హుండీ ఆదాయం

Tirumala: కోటానుకోట్ల భక్తులు కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. గత 120 రోజులుగా ఏరోజూ రూ.3 కోట్ల నుండి 4 కోట్లకు తగ్గకుండా ఆ దేవదేవునికి హుండీ కానుకల రూపంలో ఆదాయం సమకూరుతుంది. తిరుమల చరిత్రలోనే జూలై నెలలో శ్రీవారికి రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి. దీంతో వడ్డీ కాసులవాడి హుండీ కళకళలాడుతోంది.

అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్దం ప్రపంచ నలుమూలల నుండి భక్తులు తిరుమలకు వస్తుంటారు. దీంతో తిరుమల క్షేత్రం భక్తులతో కళకళలాడుతుంది. గతంలో వారాంతం, విశేష పర్వదినాలలో మాత్రమే భక్తుల రద్దీ అధికంగా ఉండేది. ఆ రోజుల్లో మాత్రమే హుండీ ఆదాయం ఎక్కువ లభించేది. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీతో ఏమాత్రం సంబంధం లేకుండా హుండీ కానుకలు 4 కోట్లకు పైగా లభిస్తుంది.

2020వ సంవత్సరం వరకు పెరుగుతూ వచ్చిన ఆదాయం ఆ తర్వాత కరోనా కారణంగా పూర్తిగా తగ్గిపోయింది. 80 రోజుల పాటు దర్శనాలు నిలివేయడంతో పాటు తర్వాత కూడా పరిమితంగానే భక్తులను అనుమతించడం వల్ల రద్దీ లేకుండా పోయింది. 2020 సంవత్సరానికి 13 వందల కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేస్తే కరోనా కారణంగా 7 వందల కోట్లకు తగ్గిపోయింది. 2021లో కూడా 9 వందల కోట్లు మాత్రమే వచ్చాయి.

ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గడంతో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా ఒక రోజుకు సరాసరి హుండీ ద్వారా రూ.4 నుండి రూ‌.5 కోట్ల రూపాయలు కానుకల రూపంలో లభిస్తుంది. గత ఆరు నెలల గణాంకాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో స్వామివారిని 10 లక్షల 95 వేల 7 వందల 24 మంది ద‌ర్శించుకోగా హుండీ ఆదాయం రూ.79.34 కోట్లు లభించింది. మార్చి నెలలో 19 లక్షల పైచిలుకు మంది భక్తులు ద‌ర్శించుకోగా రూ.128.61 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఏప్రిల్ నెలలో 20 లక్షల 62 వేల మంది భక్తులు దర్శించుకోగా హుండీ ద్వారా రూ.127.63 కోట్లు, ఆన్‌లైన్‌లో ఈ-హుండీ ద్వారా రూ 4.4 కోట్ల ఆదాయం లభించింది. మే నెలలో 22.68 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా రూ.130.29 కోట్లు లభించింది. జూన్ నెలలోనూ 23.23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ రూ.123.74 కోట్ల కానుకలు సమర్పించారు.

ఇలా ఈసారి శ్రీవారిపై కాసుల వర్షం కురుస్తుండడం పట్ల టీటీడీ సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ ఏడాది 15 వందల కోట్ల హుండీ ఆదాయం లభిస్తుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories