Tirumala: తిరుమలలో భక్తుల కోసం పాదరక్షలు భద్రపర్చేందుకు 10 కౌంటర్ల ఏర్పాటు

Tirumala Footwear Counters At 10 Locations For Devotees In Tirumala
x

Tirumala: తిరుమలలో భక్తుల కోసం పాదరక్షలు భద్రపర్చేందుకు 10 కౌంటర్ల ఏర్పాటు

Highlights

Tirumala: వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద 1187 ర్యాక్‌లు

Tirumala: తిరుమలలో పాద రక్షల సమస్యకు టీటీడీ చర్యలు చేపట్టింది. పాదరక్షలు భద్రపరిచే కౌంటర్లను టీటీడీ ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్‌ల వద్ద పాదరక్షలు భద్రపరచుటకు 10 కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్లలో భక్తులు నంబర్ ఉన్న బ్యాగ్‌లను తీసుకొని పాదరక్షలను ఉంచి, దారంతో కట్టి, అదే నంబర్ ఉన్న రాక్‌లో తిరిగి ఉంచాలని టీటీడీ ఈవో తెలిపారు. భక్తుడికి ర్యాక్ – బ్యాగ్‌తో సమానమైన నంబర్‌తో టోకెన్ జారీ చేయబడుతుందన్నారు.

భక్తులు తిరిగి వచ్చిన తర్వాత టోకెన్ ఇచ్చి వారి పాదరక్షలు పొందవచ్చని తెలిపారు. అంతేకాకుండా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద 1187 ర్యాక్‌లు, ప్రధాన కళ్యాణ కట్ట వద్ద 4 వేల ర్యాక్‌లను భక్తుల కోసం అందుబాటులో ఉంచారు. త్వరలో పీఏసీ 1,2,3, నారాయణగిరి క్యూలైన్లు, ఏటీపీ సర్కిళ్లల్లో కూడా పాదరక్షలు భద్రపరచు కేంద్రాలను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories