కడప జిల్లా ప్రొద్దుటూరులో మళ్లీ టిప్పు సుల్తాన్ వివాదం.. డివైడర్ల పై పేరు రాసి...

Tippu Sultan Issue in Prodduturu Kadapa District | AP Live News
x

కడప జిల్లా ప్రొద్దుటూరులో మళ్లీ టిప్పు సుల్తాన్ వివాదం.. డివైడర్ల పై పేరు రాసి...

Highlights

Kadapa - Tippu Sultan Issue: రాత్రికి రాత్రే డివైడర్లపై ఉన్న అక్షరాలను చెరిపేసిన పురపాలక సిబ్బంది...

Kadapa - Tippu Sultan Issue: కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. జిన్నా రోడ్డు కూడలిలోని డివైడర్లకు టిప్పు సుల్తాన్ సర్కి‌ల్ అని గుర్తుతెలియని వ్యక్తులు రాశారు. సమస్య వస్తుందని గుర్తించిన పురపాలక సిబ్బంది రాత్రికి రాత్రే డివైడర్లపై ఉన్న అక్షరాలను పెయింట్‌తో చెరిపేశారు. గతంలో జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు.

దీంతో విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, నాయకులతో కలిసి ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విగ్రహ ఏర్పాటు అంశం అప్పట్లో దుమారం రేగింది. అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో సమస్య సద్దుమణిగింది. అయితే తాజాగా టిప్పు సుల్తాన్ సర్కిల్ అని డివైడర్‌పై రాయడంతో మరోసారి చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories