logo
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి

Tigers Change Direction in Kakinada District
X

కాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి

Highlights

Kakinada: రౌతులపూడి మండలం ఏటికాలువ మీదుగా గుమ్మరేగుల చేరుకున్న పులి

Kakinada: కాకినాడలో పెద్ద పులి అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. పెద్ద పులి రూటు మార్చుకొని సార్లంక అటవీ ప్రాంతం మీదుగా నర్సీపట్నం డివిజన్‌కు వెళ్తున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. రౌతులపూడి మండలం ఏటికాలువ మీదుగా గుమ్మరేగుల చేరుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ పొట్టిమెట్ట వైపు వస్తే ఆ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడటానికి వేటగాళ్లు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తారు. దీంతో కరెంట్‌ షాక్‌కు గురయ్యే అవకాశం ఉండటంతో ఐదు బృందాలుగా ఏర్పడి అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


Web TitleTigers Change Direction in Kakinada District | AP News
Next Story