logo
ఆంధ్రప్రదేశ్

Kakinada: మకాం మార్చిన పెద్ద పులి

Tiger Fear in Kakinada District | AP News
X

మకాం మార్చిన పెద్ద పులి

Highlights

Kakinada: కాకినాడ జిల్లా పెద్దిపాలెం పొట్టిమెట్టపై పెద్దపులి అడుగుజాడలు

Kakinada: కాకినాడ జిల్లాలో పెద్దపులి వేట కొనసాగుతోంది. నెల రోజులుగా ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా తిరుగుతూ.. ముప్పుతిప్పలు పెడుతోంది. అధికారులు ఎన్ని వ్యూహాలు వేసినా మకాం మారుస్తూ ఇబ్బంది పెడుతోంది. తాజాగా కాకినాడ జిల్లా పెద్దిపాలెం పొట్టిమెట్టపై పెద్దపులి అడుగుజాడలను స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పెద్దిపాలెం చేరుకున్న అటవీ అధికారులు... పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరించే ప్రాంతాన్ని కనుగొననున్నారు.

గత కొన్ని రోజులుగా పులి భయంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాడి చేసిన గుర్తులను... పులి పాదముద్రలను గుర్తించడమే తప్ప.. పూర్తిస్థాయిలో అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Web TitleTiger Fear in Kakinada District | AP News
Next Story