చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Chittoor Fire Accident: పేపర్ ప్లేట్లు తయారు చేసే భవనంలో మంటలు

Jyothi
Published on: 21 Sept 2022 7:06 AM IST
Three Killed in Fire Accident in Chittoor AP
X

చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Chittoor Fire Accident: చిత్తూరు నగరంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని రంగాచారి వీధిలో పేపర్ ప్లేట్లు తయారీ భవనంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంట్లలో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తండ్రి ,కొడుకుతో పాటు స్నేహితుడున్నాడు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. స్థానికులు భవనం గోడలు పగులగొట్టి స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను భాస్కర్, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story