కడప జిల్లా కమలాపురం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మకు బెదిరింపులు

Threats to TDP state secretary Sainath Sharma in Kadapa District
x

కడప జిల్లా కమలాపురం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మకు బెదిరింపులు

Highlights

YSR Kadapa: రాజకీయాలు మానుకోకుటే అంతు చూస్తామని ఇంటి గోడకు పోస్టర్లు అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

YSR Kadapa: కడప జిల్లా కమలాపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామని కాగితాలపై రాసి కారుకు అంటించారు. కమలాపురంలో రామాపురం గుడి వద్ద కారు నిలిపి ఉండగా ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక కారు ధ్వంసం చేసినట్లు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. సాయినాథ్‌ కారుతో పాటు ఆయన ఇంటికి కూడా దుండగులు కాగితాలు అంటించారు.

రాజకీయాలు నీకెందుకు అంటూ బెదిరిస్తూ రాసిన లేఖలు అంటించడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో సాయినాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపు కమలాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు 'బాదుడే బాదుడు' కార్యక్రమం నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆకతాయిల పనా లేక నిజమైన బెదిరింపులా‌ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories