ఏపీలో అత్యధిక కరోనా టెస్టులు ఆ జిల్లాలోనే ఐనా పాజిటివ్ కేసులు చూస్తే షాకే

ఏపీలో అత్యధిక కరోనా టెస్టులు ఆ జిల్లాలోనే ఐనా పాజిటివ్ కేసులు చూస్తే షాకే
x
Highlights

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు రెండు వందలకు చేరుకున్నాయి. ఇప్పటికే కేసులు సంఖ్య వెయ్యి దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 61 మందికి కరోనా నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 1,016కి చేరింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు భారీ సంఖ్యలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కలిపి 61,266 కరోనా టెస్టులు నిర్వహించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 8,141 టెస్టులు చేయగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,806 పరీక్షలు చేసినట్టు అధికారికంగా వెల్లడించింది.





Show Full Article
Print Article
Next Story
More Stories