ఏపీలో డేంజర్ బెల్స్ : ఆ జిల్లాలో మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ.1000 ఫైన్

ఏపీలో డేంజర్ బెల్స్ : ఆ జిల్లాలో మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ.1000 ఫైన్
x
Highlights

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 363కి చేరింది. కర్నూలులో 75 పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 363కి చేరింది. కర్నూలులో 75 పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.దాని తర్వాత గుంటూరులోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో జిల్లా ఇప్పటి వరకు 51 మంది కరోనా బారినపడ్డారు.

ప్రకాశం జిల్లాలో 38 మంది, కృష్ణ జిల్లాలో 35 మందికి కరోన సోకింది. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు కరీనా ఫ్రీ జిల్లాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా, 10 మంది డిశ్చార్జి అయ్యారు.

ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు అధికారులు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోజుకు కొత్తగా వందల సంఖ్యలో బాధితులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తూనే.. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహాారాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మాస్క్‌ లను ధరించడం తప్పనిసరి చేశాయి.

తాజాగా గుంటూరు జిల్లా ఆ జాబితాలో చేరిపోయింది. జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని కలెకర్ట్ శామ్యూల్ ఆనంద్ స్పష్టం చేశారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకోవాలని అన్నారు. మళ్లీ సాయంత్రం 5 తర్వాత రహదారులపైకి రావాలన్నారు. పనివేళల్లో ఉద్యోగులను రోడ్ల మీదుకు అనుమతించేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories