ఆ ఇద్దరు మరణించింది ఇసుక కొరత వలన కాదా!

ఆ ఇద్దరు మరణించింది ఇసుక కొరత వలన కాదా!
x
Highlights

ఆ ఇద్దరు మరణించింది ఇసుక కొరత వలన కాదా! ఆ ఇద్దరు మరణించింది ఇసుక కొరత వలన కాదా!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సంక్షోభం ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు, ఈ విషయాన్ని స్వయానా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అంగీకరించారు. ఇసుక విషయంలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు రాజకీయ మైలేజీకి కోసం ప్రయత్నిస్తున్నాయని మంత్రులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు మాత్రం అత్యంత దుర్భర స్థితిలో ప్రస్తుతం బ్రతుకీడుస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ప్రతిపక్షాలు చెబుతున్నట్టు నిజంగా కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారా అంటే చెప్పలేని పరిస్థితి.

గుంటూరు జిల్లాలోని బాపట్ల మండలం భారతిపుడి గ్రామానికి చెందిన రమేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ ఇంట్లో సోమవారం రాత్రి రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే రమేష్ ఆత్మహత్య విషయంలో పోలీసులు అక్కడికి చేరుకోకముందే, స్థానిక టిడిపి నాయకులు అతను నిర్మాణ కార్మికుడని, ఇసుక సంక్షోభం కారణంగా పని లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.

అయితే, వాస్తవానికి రమేష్ వ్యవసాయ కూలీ అని, చెడు వ్యసనాలకు బానిసయ్యాడని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు మృతుడిపై కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసుల విషయంలో రమేష్ గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.. అతను నిర్మాణ పనులలో ఎప్పుడూ పాల్గొనలేదని తేల్చారు.

ఇదిలావుంటే కాకినాడలోని మూడు అంతస్థుల భవనం నుండి పడి వీరబాబు అనే వ్యక్తి మరణించాడు. పోలీసుల దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ డెత్ అని తేలినప్పటికీ, కొందరు రాజకీయ నాయకులూ దీనిని ఆత్మహత్యగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు.. ఇసుక సంక్షోభం కారణంగా పని లేకపోవడం వల్ల వీరబాబు ఆత్మహత్య చేసుకున్నట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీరబాబు కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా పరామర్శించారు.

వీరబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీరబాబు ఇసుక కొరత కారణంగా చనిపోలేదని.. ప్రమాదవశాత్తు భవనం మీదనుంచి పడి చనిపోయినట్టు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం మీద బురదజల్లేందుకే వీరబాబు మృతిని వాడుకుంటున్నారని ఆరోపించారు.. ఇలా చెబితేనే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని టీడీపీ నేతలు వీరబాబు కుటుంబసభ్యులకు చెప్పినట్టు ఎమ్మెల్యే చెప్పారు. అతను చనిపోవడం బాధాకరమే అయినా అతను ఇసుక కొరత కారణంగా మాత్రం చనిపోలేదని ఆయన వెల్లడించారు.

మరొక చోట గుండె జబ్బుతో ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, అతను కూడా భవన నిర్మాణ కార్మికుడని టీడీపీ చెబుతోంది. అయితే మరణించిన ప్రతి వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడు అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు.. ప్రతిపక్షాలు రాజకీయం కోసం కూడా ఇలా చెయ్యొచ్చు.. అయితే ఇందులో నియమెంతుందో తెలియాలంటే మాత్రం పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు బయటికి వస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories