ఈసారి సీట్లలో కీలక మార్పులు చేసిన టీడీపీ

ఈసారి సీట్లలో కీలక మార్పులు చేసిన టీడీపీ
x
Highlights

గురువారం రాత్రి ప్రకటించిన టీడీపీ జాబితాలో స్వల్ప మార్పులు, తీసివేతలు జరిగాయి.. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడును ఆమె కుమారుడు...

గురువారం రాత్రి ప్రకటించిన టీడీపీ జాబితాలో స్వల్ప మార్పులు, తీసివేతలు జరిగాయి.. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడును ఆమె కుమారుడు శ్రీరామ్ కు కేటాయించారు చంద్రబాబు.. అలాగే మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు స్థానాన్ని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు. జవహర్ కు కృష్ణా జిల్లా తిరువూరు స్థానాన్ని ఇచ్చారు. పాయకరావు పేటలో బంగారయ్యకు ఇచ్చారు. అంతేకాదు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సిట్టింగ్ సీటును గతంలో పోటీ చేసిన భూదాల అజితారావుకు కేటాయించారు.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు వరుపుల రాజా, రాజమండ్రి సిటీని ఆదిరెడ్డి భవాని, చిత్తూరు జిల్లా నగరి టిక్కెట్ ను మాజీ మంత్రి దివంగతనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భాను, చంద్రగిరి గతంలో గల్లా అరుణకుమారి పోటీ చేయగా.. ఈసారి ఆమె పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ స్థానాన్ని పులివర్తి నాని కి కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories