పిట్ట కొంచెం… గాత్రం ఘనం.. తను పాట పాడుతుంటే.. చెవుల్లో తేనే పోసినట్లే..

This Little Girl From Konaseema Shows Amazing Talent In Singing
x

పిట్ట కొంచెం… గాత్రం ఘనం.. తను పాట పాడుతుంటే.. చెవుల్లో తేనే పోసినట్లే..

Highlights

Ambedkar Konaseema: ఒక వైపు చదువును మరో వైపు కళలను సమన్వయం చేస్తోన్న హృద్య

Ambedkar Konaseema: పట్టుమని పదేళ్లయినానా లేవు. అయితేనేం సంగీతం మీద భలే పట్టుంది. కేవలం గాత్రంతోనే కాదు, నాట్యంలోనూ మెప్పిస్తోంది. దేశం కాని దేశంలో.. మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తోంది. ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటూ.. ఎంతోమంది బాలలకు ఆదర్శంగా నిలుస్తుంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన గణిశెట్టి శివన్నారాయణ, శ్రీదేవిల సంతానమే హృద్య . అమ్మానాన్న ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. అక్కడే ప్రస్తుతం ఈ చిన్నారి మూడో తరగతి చదువుతోంది. చిన్ననాటి నుంచి తమ కూతురు సంగీతంపై అభిరుచిని గమనించిన తల్లితండ్రులు తగిన ప్రోత్సాహం అందించారు. వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరంలో నలినీ కృష్ణన్ దగ్గర అయిదేళ్లుగా కర్ణాటక సంగీతం, భరతనాట్యం నేర్పిస్తున్నారు. రెండేళ్లుగా శ్రీరామాచారి వద్ద సినీ సంగీతంలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఒక వైపు చదువును మరో వైపు కళలను సమన్వయం చేసుకుంటూ హృద్య ముందుకు సాగుతోంది.

ఈ చిన్నారి వయసుకు మించి అమెరికాలోని పలు ప్రాంతాల్లో సంగీత కచేరీల్లో పాల్గొనడం ప్రారంభించింది. వందలు, వేల సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులను తన గాత్రంతో కట్టిపడేసింది. వారి కరతాళ ధ్వనులతో ప్రాంగణాలు మారుమోగేలా చేసింది. అమెరికాలో పలు తెలుగు సంఘాలు నిర్వహించే స్టేజ్ షోలకు ప్రారంభంలో భక్తి గీతాలు పాడి ప్రేక్షకులను మెప్పిస్తోంది. అమెరికాలో జరిగే సంగీత సినీ ఆర్టిస్ట్- అవార్డును గెలుచుకుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందా ఆనడానికి ఏమాత్రం సంశయం లేదు. చిరుప్రాయం నుంచే తన ప్రతిభను చాటుతోంది.

మణిశర్మ సెటిల్ కాంటెస్టు గెలిచి ఆయన నుంచి ప్రశంసలు అందుకుంది. తన ఏడో ఏట తమన్ షోలో వేలాది ప్రేక్షకుల మధ్య లా హే బాహే అంటూ సినీ గీతాన్ని ఆలపించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నుంచీ అభినందనలు అందుకుంది. కేవలం అమెరికాలోనే కాదు… తమ స్వగ్రామమైన అంబేద్కర్ కోనసీమ జిల్లా సన్నపల్లి రామాలయంలో హిృద్య ఇటీవల శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహించింది. స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్ధులు మైమరిచి ఆలకించారు. అమెరికాలో ఉంటున్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలు, కళలను మరిచిపోలేదని అందరూ అభినందించారు. గత నెలలో అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంలో జరిగిన కచేరితోనూ అబ్బురపరిచింది ఈ చిన్నారి. శాస్త్రీయ సంగీతంలో అత్యున్నత స్థాయికి చేరటమే తన లక్ష్యమని చెబుతోంది. భవిష్యత్తులో కర్ణాటక గాత్ర కచేరీలో ఉన్నత స్థాయికి ఎదగాలని హృద్య ఆకాక్షింస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories