CM Jagan: మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు..

This Government Will Not Act To Hurt Your Heart Says Jagan
x

CM Jagan: మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు

Highlights

CM Jagan: మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు

CM Jagan: సీఎం జగన్‌ను ముస్లిం ప్రజాప్రతినిధులు,మత పెద్దలు కలిశారు. ఉమ్మడి పౌరస్మ్ముతి అంశంపై తమ అభిప్రాయాలను సీఎం జగన్‌కు వారు తెలిపారు. ఈ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల మైనారిటీ ప్రభుత్వమని...మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సీఎం జగన్ అన్నారు. మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంమీద డ్రాఫ్ట్‌ ఇప్పటి వరకూ రాలేదని...అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదన్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోందని...వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిపై మీ ఆలోచనలు సలహాలు ఇవ్వడంటూ ముస్లిం మత పెద్దలను సీఎం జగన్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories