బోటు ఆపరేషన్ లో పురోగతి.. ఈ మధ్యాహ్నం లోపు బోటును వెలికితీస్తామంటోన్న ధర్మాడి టీమ్

బోటు ఆపరేషన్ లో పురోగతి.. ఈ మధ్యాహ్నం లోపు బోటును వెలికితీస్తామంటోన్న ధర్మాడి టీమ్
x
Highlights

కచ్చులూరు వద్ద గోదావరి లో మునిగిన వశిష్ఠ బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. నదీ గర్భంలోకి లంగర్ వేసి బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం...

కచ్చులూరు వద్ద గోదావరి లో మునిగిన వశిష్ఠ బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. నదీ గర్భంలోకి లంగర్ వేసి బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. నిన్న బోటు రెయిలింగ్ బయటకు తీయడంతో గోదావరిలో నుంచి బోటును వెలికితీస్తామన్న నమ్మకం బలపడింది. బోటు ప్రమాదం జరిగి 33 రోజులు కావొస్తోంది. ఇంకా 13 మంది ఆచూకీ లభించలేదు.

నిన్న బోటు వెలికితీత ప్రక్రియలో పురోగతి కనిపించింది. కచ్చులూరు సమీపంలో బోటును గుర్తించిన ధర్మాడి సత్యంబృందం లంగరు సాయంతో బోటును ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో లంగరుకు వశిష్ఠబోటు రెయిలింగ్ చిక్కింది. పొక్లెయిన్ తో ఐరన్ రోప్ ను బలంగా లాగడంతో బోటు రెయిలింగ్ ఊడి వచ్చింది. రెయిలింగ్ ను ఒడ్డుకు చేర్చారు.

గోదావరి నదిలో 70 అడుగుల లోతులో బోటు ఉందని ధర్మాడి సత్యం బృందం అంచనా వేస్తోంది. దేవుడిగొందుగా పిలిచే ప్రాంతంలో బోటు ఉన్నట్లు భావిస్తోంది. నదీగర్భంలో బురద లేదా ఇసుకలో బోటు కురుకుపోవడంతో బోటులో కదలికలు లేవని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లంగర్లు బోటు మధ్యభాగంలో తగిలితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అన్ని అడ్డంకులు ధాటి ఈ మధ్యాహ్నం లోపు బోటును వెలికితీస్తామని ధర్మాడి సత్యం బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories