YCP Third List: వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Third list of YCP candidates released
x

YCP Third List: వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Highlights

YCP Third List: రాయదుర్గం- మెట్టు గోవింద రెడ్డి, మడకశిర- శుభ కుమార్

YCP Third List: వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. మొత్తం 17మందితో లిస్టు రిలీజ్ అయింది. ఇందులో 8 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. కర్నూల్ లోక్‌సభ బరిలో మంత్రి గుమ్మనూరి జయరామ్‌ను నిలపనున్నారు. అలాగే నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి, త్వరలో వైసీపీలో చేరనున్న కేశినేనికి కూడా ఎంపీ టికెట్ కన్ఫామ్ అయింది. కేశినేనికి విజయవాడ టికెట్ కేటాయించారు. అలాగే బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్, ఎలిజాకు అమలాపురం, మజ్జి శ్రీనివాస్‌కు విజయనగరం, కిలార్ పద్మకు అనకాపల్లి లోక్‌సభ స్థానం కేటాయించారు జగన్.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తూ మూడో లిస్ట్ విడుదల చేశారు జగన్. చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్ బరిలో విజయ జయరాజ్ నిలువనున్నారు. చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, గూడూరు నుంచి మెరుగు మురళీ, ఆలూరు నుంచి విరూపాక్ష, దర్శి నుంచి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నందికొట్కూర్‌ నుంచి గంగాధర, నెల్లూరు నుంచి కృపా లక్ష్మి, రాయదుర్గం నుంచి మెట్టు గోవింద రెడ్డి, మడకశిర నుంచి శుభ కుమార్‌ను పోటీ చేయించబోతున్నారు సీఎం జగన్.

రెండోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దించుకున్నారు. ఈ క్రమంలో గ్రాఫ్ సరిగా లేని సిటింగ్‌లను పక్కన పెడుతున్నారు. అందుకోసమే సర్వే అంచనాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే 11మందితో ఫస్ట్, 27మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన సీఎం జగన్.. 17మందితో థర్డ్ లిస్టును విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories