వైసీపీ మూడోలిస్ట్‌పై కసరత్తు.. సంక్రాంతి నాటికి ఫైనల్ లిస్ట్

Third List of YCP
x

 వైసీపీ మూడోలిస్ట్‌పై కసరత్తు.. సంక్రాంతి నాటికి ఫైనల్ లిస్ట్ 

Highlights

YCP Third List: మార్పులు చేర్పులపై తుది దశకు కసరత్తు

YCP Third List: వై నాట్ 175 లక్ష్యంగా అధికార వైసీపీ అడుగులేస్తోంది. అధికారమే పరమావధిగా నియోజకవర్గాల్లో ఇంఛార్జులను మార్చుతోంది. పార్టీ వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో.. ఇంఛార్జులను మార్చి.. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. తాజాగా.. మూడోసారి మరో 10 నుంచి 15 స్థానాల్లో ఇంఛార్జులను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా.. ఇప్పటికే మొదటి లిస్ట్‌లో 11 మంది, రెండో లిస్ట్‌లో 27 మంది ఇంఛార్జులను మార్చింది. ఈసారి రాయదుర్గం, మడకశిర, సింగనమల, గూడూరు, పూతలపట్టు, నంద్యాల, గంధారనెల్లూరు, చిత్తూరు, మదనపల్లె, దర్శి, గిద్దలూరు, తిరువూరు, నందిగామ, చింతలపూడి, పెందుర్తి, చౌడవరం ప్రాంతాల ఇంఛార్జులను మార్చుతున్నట్టు సమాచారం అందుతోంది. కాగా.. 175 నియోజకవర్గాల్లో 65 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని గతంలోనే వైసీపీ పెద్దలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories