Anantapur: అనంతపురం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో దొంగ ఆత్మహత్య

Thief Commits Suicide At Anantapur Police Station
x

Anantapur: అనంతపురం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో దొంగ ఆత్మహత్య

Highlights

Anantapur: రాయదుర్గం పీఎస్‌లో దొంగ మృతిపై ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్‌

Anantapur: అనంతపురం రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో దొంగ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. లుంగీతో ఉరేసుకుని దొంగ రామాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. గొర్రెల దొంగతనం చేస్తూ స్థానికులకు ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు. వారిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో రామాంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్‌ అయ్యారు. సీఐ శ్రీనివాస్, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు ఒక హోంగార్డ్‌ను సస్పెండ్‌ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ విధమైన చర్యలు తీసుకున్నారు ఎస్పీ ఫకీరప్ప.

Show Full Article
Print Article
Next Story
More Stories