మంగళగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

మంగళగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని పెదవడ్లపూడి సాయిబాబా గుడి వద్ద గురువారం రాత్రి లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ...

గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని పెదవడ్లపూడి సాయిబాబా గుడి వద్ద గురువారం రాత్రి లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చనిపోయారు. తెనాలి వైపు నుంచి వస్తున్న పాలవ్యాను, పెదవడ్లపూడి వైపు వెళుతున్న ఆటోను సాయిబాబా గుడివద్ద ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. స్థానికులు 108 సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అందులో ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories