మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులో భారీ చోరీ

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులో భారీ చోరీ
x
Highlights

మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీసు చోరీకి గురైంది. ఆయన కార్యాలయంలోని రూ.10 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు....

మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీసు చోరీకి గురైంది. ఆయన కార్యాలయంలోని రూ.10 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికంగా ఉన్న సమస్యలను తీర్చడం కోసం ఆర్కే తన కార్యాలయంలో కొంత డబ్బును ఆఫీసులో ఉంచారు. అయితే అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆఫీసులోకి ప్రవేశించి ఆ డబ్బు తోపాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆర్కే వెంటనే స్థానిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని అనుమానిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అతను తనకేం తెలియదని చెబుతున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories