logo
ఆంధ్రప్రదేశ్

AP News: వైసీపీ కీలక నేతల ఇళ్లల్లో దొంగతనం... ఒంటిమీద దుస్తులు లేకుండా..

AP News: వైసీపీ కీలక నేతల ఇళ్లల్లో దొంగతనం... ఒంటిమీద దుస్తులు లేకుండా..
X

AP News: వైసీపీ కీలక నేతల ఇళ్లల్లో దొంగతనం... ఒంటిమీద దుస్తులు లేకుండా..

Highlights

AP News: గుంటూరు జిల్లా తాడేపల్లిలో దొంగలు హల్‌చల్ చేశారు.

AP News: గుంటూరు జిల్లా తాడేపల్లిలో దొంగలు హల్‌చల్ చేశారు. సీఎం నివాసానికి సమీపంలోని రెయిన్‌ బో విల్లాస్‌లో చోరీ యత్నం జరిగింది. తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి‌, వైసీపీ కీలక నేత నివాసాల్లో చోరీలకు దొంగలు యత్నించారు. అయితే మూడ్రోజుల క్రితం నేతల ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు పోలీసులకైతే ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

రెయిన్ బో విల్లాస్‌లో ఐదుగురు సభ్యులు ఒంటిమీద దుస్తులు లేకుండా ఒక్క చెడ్డీ మాత్రమే ధరించి, తలపాగాలు చుట్టి రెండు ఇళ్ల మధ్యలో ఉన్న సందులో వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.

తాడేపల్లి ప్రాంతంలో కనిపించిన ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్‌ గుంటుపల్లిలో ఉన్న చెడ్డీగ్యాంగ్‌ పోలికలు ఒకే విధంగా ఉండడంతో బెజవాడ పోలీసులు, గుంటూరు పోలీసులు సంయుక్తంగా ఆ గ్యాంగ్‌ ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Web TitleTheft at Rainbow Villas Near CM's Residence in Andhra Pradesh
Next Story