Visakha: పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు తాళం వేసిన మహిళ

The woman Locked Pendurthi Police Station
x

Visakha: పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు తాళం వేసిన మహిళ

Highlights

Visakha: తాను నివాసముండే అపార్ట్‌మెంట్ సామాగ్రి పడేశారని ఆరోపణ

Visakha: విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ తాళం వేసింది. తాను నివసిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌ నుంచి సామాగ్రి మొత్తం బయటపడేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది. ఐదు రోజులుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. దీంతో అసహనానికి గురైన మహిళ పోలీస్ స్టేషన్ గేటుకు తాళం వేసి నిరసన తెలియజేసింది. తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోరి వెళ్లనిచ్చేలా సాయం చేయాలని కోరింది. న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే దీక్షకు దిగుతానని పోలీసులను హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories