ఏపీలో జోరుగా ముందస్తు ఎన్నికల ప్రచారం.. ప్రచారాలను పట్టించుకోవద్దని మంత్రులకు సీఎం జగన్ సూచన

The Vigorous Early Election Campaign In AP
x

ఏపీలో జోరుగా ముందస్తు ఎన్నికల ప్రచారం.. ప్రచారాలను పట్టించుకోవద్దని మంత్రులకు సీఎం జగన్ సూచన

Highlights

CM Jagan: మంత్రులు మరింత బాధ్యతగా పనిచేయాలన్న సీఎం జగన్

CM Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్ తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఈ ప్రచారం మొదలైంది. అనంతరం ఏపీలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చాక తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లు కనిపించింది. అయితే ఇంకా పలు చోట్ల ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న కేబినెట్ భేటీపైనా దీని ప్రభావం పడింది.

ఏపీలో నిన్న జరిగిన కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్‌ను మంత్రులు ఇదే అంశంపై ప్రశ్నించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోందని జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై జగన్ స్పందించారు. ఈ ప్రచారాల్ని పట్టించుకోవద్దని మంత్రులకు సూచించారు. అవన్నీ వదిలేసి వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. మిగతా విషయాలు తనకు వదిలిపెట్టమన్నారు. దీంతో మంత్రులకు క్లారిటీ వచ్చినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories