ఏపీలో తొలిరోజు ముగిసిన వ్యాక్సినేషన్.. ఎంతమందికి వేశారంటే

ఏపీలో తొలిరోజు ముగిసిన వ్యాక్సినేషన్..  ఎంతమందికి వేశారంటే
x
Highlights

*ఏపీ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ *సాంకేతిక సమస్యతో 50 శాతం మాత్రమే వ్యాక్సినేషన్

ఏపీలో తొలిరోజు వ్యాక్సినేషన్ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 332 కేంద్రాల్లో కరోనా ఫ్రంట్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందించారు. తొలిరోజు ఏపీ వ్యాప్తంగా 18 వేల మందికి వ్యాక్సిన్ అందించినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే.. సాంకేతిక సమస్యల కారణంగా 50 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు వెల్లడించారు. టీకాలు వేయించుకున్న వారంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపిన అధికారులు.. 28 రోజుల తర్వాత రెండో డోసు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

మరోవైపు.. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన వ్యాక్సినేషన్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదని వైద్య అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.87 లక్షల మందికి తొలిదశ వ్యాక్సిన్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories