Viveka Murder Case: వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

The Supreme Court will hear the petition of Viveka Daughter Sunitha Today
x

Viveka Murder Case: వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Highlights

Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన.. మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్‌

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తును స్వేచ్ఛగా జరిపేలా చూడాలని కోరారు. ప్రస్తుతం వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉందని సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈనెల 30లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయన్నారు.

ఈనెల 25 వరకు అరెస్ట్ చేయకుండా తెలంగాణ మధ్యంతర ఉత్తర్వులతో కేసు తప్పుదోవ పట్టే అవకాశాలున్నాయని తెలిపారు సిద్ధార్థ లూథ్రా. సునీత తరపు లాయర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 28న విచారణ చేస్తామని తెలపగా.. అప్పటికి పిటిషన్‌ కాలం చెల్లుతుందని అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.దీంతో ఇవాళ విచారణ జరిపేందుకు ధర్మాసనం అంగీకరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories