తెలుగుదేశం పార్టీ మహానాడు వెనుక కథ ఇదీ!

తెలుగుదేశం పార్టీ మహానాడు వెనుక కథ ఇదీ!
x
Highlights

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా.. పార్టీకి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలను మరింత బలపరుచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని...

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా.. పార్టీకి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాలను మరింత బలపరుచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తువస్తున్నారు. బుధ, గురువారాల్లో ఈ సారి మహానాడు జరగబోతోంది. ఎప్పుడూ అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకను కరోనా నేపధ్యంలో ఆన్ లైన్ వేడుకగా నిర్వహించే ఏర్పాట్లు చేసుకుంది తెలుగుదేశం పార్టీ.

మహానాడు ఇలా..

సినిమా నటుడిగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు (ఎన్టీఅర్) అప్పటి కాంగ్రెస్ రాజకీయాలలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి 1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. కేవలం ఎనిమిది నెలల్లోనే పార్టీని ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి తీసుకువచ్చారు.

ప్రజల మనసుల్ని దోచుకున్న ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే..కిలో రెండు రూపాయలకే బియ్యం, ఆడపడుచులకు సమాన హక్కులు, మొదటి మహిళా యూనివర్సిటీ, పట్వారీ వ్యవస్థ రద్దు, దేవదాసీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో కార్యక్రమాలతో ఆరు కోట్ల తెలుగు ప్రజల అభిమానాన్ని పూర్తిగా తన స్వంతం చేసుకున్నారు.

ప్రజల కోసం ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్ పార్టీలోని తన సహచరులను గుడ్డిగా నమ్మడంతో అధికారాన్ని కోల్పోయారు. అయితే, అయన తెలుగు ప్రజలకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనిది. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఇప్పటికీ ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28. ఆయన పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. అంతే కాకుండా రెండేళ్లకోసారి మే 27, 28 తేదీల్లో రెండురోజుల పాటు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మహానాడు పేరుతొ ఒక్క దగ్గర చేరి ఎన్టీఅర్ కు ఘనంగా నివాళి అర్పించడంతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ముఖ్యమైన తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఈసారి మహానాడు ఇలా..

కరోనా వైరస్ ముప్పుతో లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. జూమ్ యాప్ ద్వారా వీడియో ఛాట్ మీటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

దీనికోసం జూమ్ యాప్ ను పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అందరికీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇచ్చారు.

బుధ, గురువారాల్లో మహానాడు జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో రాజకీయ, సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య సంబంధిత అంశాలపై చర్చిస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనకు సంబంధించిన వ్యవహారాలపై కూడా చర్చిస్తారని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేవిధంగా మహానాడును ఉపయోగించుకోనున్నారని అంటున్నారు.

ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడు ద్వారా దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించాబోతోంది. జూమ్ యాప్ ద్వారా వెలది మందితో సమావేశాన్ని నిర్వహిస్తున్న తోలి రాజకీయ పార్టీగా తెలుగుదేశం నిలిచిపోనుంది. ఈ సమావేశాలు ఎలా నిర్వహిస్తారు. ఏవిధంగా అందరితో ఇంటరాక్ట్ అవుతారు అనే విషయంలో ప్రజలందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories