Pawan Kalyan: బైజూస్ ట్యాబ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.580కోట్ల ఖర్చు.. వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు?

The State Government Spent Rs.580 Crores For Byjus Tabs Says Pawan Kalyan
x

Pawan Kalyan: బైజూస్ ట్యాబ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.580కోట్ల ఖర్చు.. వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు?

Highlights

Pawan Kalyan: ట్విట్టర్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగిన జనసేనాని

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీలో విద్యా విధానంపై ప్రశ్నిస్తూ పవన్ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ , బైజూస్ సీఈవో రవీంద్రన్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క ట్యాబ్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా? అని ప్రశ్నించారు. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? అని ప్రశ్నించారు. కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? అనేది క్లారిటీ లోపించిందన్నారు. బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదని పవన్ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories