మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా పోస్టుకార్డుల ఉద్యమం

మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా పోస్టుకార్డుల ఉద్యమం
x
Highlights

కడియం: పట్టణంలోని దేవి సెంటర్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పిలుపు మేరకు మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి...

కడియం: పట్టణంలోని దేవి సెంటర్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పిలుపు మేరకు మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ కి మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుచూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించి, శాసనమండలి కి పంపించగా తెలుగుదేశం పార్టీ దురుద్ధేశం తో బిల్లును మండలి చైర్మన్ ద్వారా అడ్డుకొని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మంట కలుపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోణం సత్యనారాయణ, చిక్కాల ఈశ్వరరావు, ఉప్పులూరి ఏడుకొండలు, గణేశుల గంగారావు, సాదే ప్రేమ్ కుమార్, నేతి నానాజీ, దాసరి ఆదిలక్ష్మి, చెల్లబోయిన దుర్గాప్రసాద్, గణేశుల చక్రి, గూనపల్లి సూరిబాబు, పున్నంరాజు వీర్రాజు, ఐశెట్టి ఏసుబాబు, సాదే రాజేష్, గంగరాజు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories