హీట్‌ పుట్టిస్తున్న గుంటూరు రాజకీయం.. చిన్న పిల్లాడితో తొడకొట్టించిన వైసీపీ ఎమ్మెల్యే

హీట్‌ పుట్టిస్తున్న గుంటూరు రాజకీయం.. చిన్న పిల్లాడితో తొడకొట్టించిన వైసీపీ ఎమ్మెల్యే
x
Highlights

* వారంక్రితం వైసీపీ నేతలపై యరపతినేని విమర్శలు * దాచేపల్లిలో మీసం మెలేసి తొడకొట్టిన యరపతినేని * చిన్న పిల్లాడితో తొడకొట్టించిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

గుంటూరు రాజకీయాలు చలిలో సైతం చెమటలు పట్టిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే.. అటు మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వారి చర్యలతో పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరిగింది. వారం క్రితం దాచేపల్లిలో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మీసం మెలేసి తొడకొట్టారు. ఆ సందర్భంగా గురజాల్‌ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ అడుగు ముందు కేసి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు.

అయితే.. ఇప్పుడు యరపతినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. దాచేపల్లిలో పర్యటించిన ఆయన.. టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరని అన్నారు. ఒక చిన్న పిల్లావాడితో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా తొడకొట్టించిన ఆయన.. యరపతినేని పల్నాడు వాసులు ఎప్పుడో తరమివేశారంటూ విమర్శలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories